పాన్ ఇండియా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప 2 ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంచైజీ సినిమాలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. కన్నడ భామ రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్‌రోల్ పోషిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారని తెలిసిందే. స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ పాటకు శ్రీలీలను తీసుకున్నారని తెలిసిందే. తాజాగా శ్రీలీల సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ పాట కోసం వారం రోజుల టైమ్ తీసుకోబోతున్నారని ఒక సమాచారం. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు తమన్ కొత్తగా సీక్వెల్‌కు పనిచేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- November 8, 2024
0
106
Less than a minute
Tags:
You can share this post!
administrator


