తెలుగు నటి శోభితా ధూళిపాళ్ల తన పెళ్లి పనులు పసుపు దంచడంతో మొదలుపెట్టింది. టాలీవుడ్ నటుడు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. సమంతతో డైవర్స్ అయ్యాక శోభితాతో ప్రేమలో పడ్డాడు నాగచైతన్య. రీసెంట్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. నవంబర్‌లో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. తన పెళ్లికి సంబంధించి ఇప్పటినుంచే పనులు మొదలుపెట్టింది ఈ భామ. తాజాగా తన హల్దీ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి వైజాగ్‌లోని తన ఇంట్లో పసుపు దంచుతున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పసుపు దంచడం దగ్గరికి వచ్చిందంటే పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- October 21, 2024
0
34
Less than a minute
Tags:
You can share this post!
administrator