ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో పలు పాత్రలను పరిచయం చేసినప్పటికీ, కథలోని ప్రధాన కాన్ఫ్లిక్ట్ను దర్శకుడు రహస్యంగానే ఉంచారు. ఇప్పుడు ఆ మెయిన్ ట్రాక్‌కు కృతి సనన్ పాత్రకు సంబంధం ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రశాంత్ నీల్ సినిమాలంటే డార్క్ టోన్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ గుర్తుకొస్తాయి. అయితే ‘డ్రాగన్’లోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం పూర్తిగా కలర్ఫుల్గా ఉండబోతున్నాయని సమాచారం. ఈ కొత్త విజువల్ స్టైల్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2027 జూన్ 11న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

