కరణ్‌ జోహార్‌ ప్రొడక్షన్స్‌లో 50% షేర్స్ కొన్న సీరమ్‌ సీఈఓ

కరణ్‌ జోహార్‌ ప్రొడక్షన్స్‌లో 50% షేర్స్ కొన్న సీరమ్‌ సీఈఓ

కరణ్‌ జోహార్ ‌ ధర్మా ప్రొడక్షన్‌లో 50 శాతం వాటాలను టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలా  కొనుగోలు చేశారు. కరణ్‌ జోహార్ ‌.. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కరణ్‌ జోహార్‌.. అతి తక్కువ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ మేకర్స్‌లో ఒకరిగా అయిపోయారు. డైరెక్టర్‌గానే కాదు నిర్మాతగానూ కూడా చాలా సినిమాలు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్‌ ద్వారా.. పలు దక్షిణాది సినిమాల్ని హిందీలో రిలీజ్‌ చేసి.. డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోనూ తన ముద్ర వేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం తన నిర్మాణ సంస్థను కరణ్‌ జోహార్‌ అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. చివరికి టీకాల తయారీ సంస్థ అయిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలాకు ఆ అవకాశం దక్కింది. ఈ ధర్మా ప్రొడక్షన్స్‌లో పూనావాలా ఏకంగా రూ.వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు. తద్వారా ధర్మా ప్రొడక్షన్స్‌లోని 50 శాతం వాటాను అదర్‌ పూనావాలా నేతృత్వంలోని సెరెన్‌ ప్రొడక్షన్స్‌ దక్కించుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ డీల్‌ తర్వాత ధర్మా ప్రొడక్షన్స్‌ విలువ ఏకంగా రూ.రెండు వేల కోట్లకు ఎగబాకుతుందని సెరీన్‌ ప్రొడక్షన్‌ పేర్కొంది.

ఇకపై ధర్మా ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కరణ్‌ జోహార్‌ సినిమా నిర్మాణం చూసుకుంటారని, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అపూర్వ మెహతా ప్రొడక్షన్ ఆపరేషన్స్‌ చూసుకుంటారని స్పష్టం చేసింది.

administrator

Related Articles