పరశురామ్‌ డైరెక్షన్‌లో సిద్ధూ జొన్నలగడ్డ?

పరశురామ్‌ డైరెక్షన్‌లో  సిద్ధూ జొన్నలగడ్డ?

టిల్లూ ఫ్రాంచైజీతో ఒక్కసారిగా స్టార్‌ హీరోల జాబితాలోకి ఎక్కాడు సిద్ధూ జొన్నలగడ్డ. ముఖ్యంగా ‘టిల్లూ స్క్వేర్‌’ సినిమాతో 100 కోట్ల హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ సినిమాతోపాటు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసుకదా’ అనే సినిమాలు చేస్తున్నాడు సిద్ధు. వీటి తర్వాత ‘టిల్లూ క్యూబ్‌’ కూడా ఉంటుందని ఆయన ఇండైరెక్ట్‌గా మీడియాకు హింట్‌ ఇచ్చారు. ఇదిలావుంటే.. సిద్ధూ కథానాయకుడిగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వార్త బలంగా హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాకు పరశురామ్‌ డైరెక్షన్ చేస్తారు. దిల్‌రాజు బ్యానర్‌లో ఈ సినిమా రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సిద్ధుతో ఓ సినిమా చేస్తానని దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సిద్ధు చేస్తున్న రెండు సినిమాల షూటింగులు పూర్తయ్యాక, ఈ సినిమా సెట్స్‌కి ఎక్కిస్తామన్నారు. ఈ సినిమా తర్వాత ‘టిల్లూ క్యూబ్‌’ కూడా ఉంటుందని తెలుస్తోంది.

editor

Related Articles