సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా సినిమా తాజాగా సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన తాజా సినిమా మజాకా. ఈ సినిమాకు త్రినాధరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ 36 రోజుల్లోనే కంప్లీట్ చేసినట్లు తెలిపాడు. కేవలం 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ని కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, డబ్బింగ్ పనులు, ప్రమోషన్స్ పూర్తి చేసుకుని సినిమా మీ ముందుకు వచ్చింది. సంక్రాంతి వచ్చినా మాకు పండుగ కూడా లేదు. అర్ధరాత్రి వరకు షూట్ చేసి మళ్లీ.. ఉదయం 4 గంటలకే షూటింగ్‌కి వచ్చే వాళ్లం. అంతా కష్టపడ్డాం ఈ సినిమాకి అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

- February 28, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor