కృష్ణుణ్ణి చూపించండి డైరెక్టర్‌గారూ, మహేష్‌బాబు ఐతే కరెక్ట్..

కృష్ణుణ్ణి చూపించండి డైరెక్టర్‌గారూ, మహేష్‌బాబు ఐతే కరెక్ట్..

‘కల్కి 2898ఏడీ’ సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్‌అశ్విన్‌ చెప్పిన విశేషాలు ఆ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. ఒకవేళ ‘కల్కి’ సీక్వెల్‌లో కృష్ణుని పాత్రను చూపించాలనుకుంటే.. మీరు ఏ హీరోని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘అసలు ‘కల్కి’ యూనివర్స్‌లో కృష్ణ పాత్రధారి ముఖాన్ని రివీల్‌ చేయకూడదనే నేను నిర్ణయించాను. ఒకవేళ పూర్తిస్థాయిలో కృష్ణుణ్ణి చూపించాలనుకుంటే.. మహేష్‌బాబు అయితే కరెక్ట్‌. కృష్ణుడిగా ఆయన కనిపిస్తే అభిమానులకు పూనకాలే. టీజర్‌ రిలీజ్‌కు ముందే సినిమా ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ‘ఖలేజా’లో ఆయన పోషించిన దేవుడి తరహా పాత్ర అంటే నాకు చాలా ఇష్టం.’ అని చెప్పారు నాగ్‌అశ్విన్‌. ఈ మాటలు విన్న అభిమానులు.. కృష్ణుణ్ణి  చూపించండి డైరెక్టర్‌గారూ.. కృష్ణుడు కనిపిస్తేనే బావుంటుంది.. మహేష్‌ని కూడా కలిసి మాట్లాడండి.. అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు.

editor

Related Articles