‘అరుంధతి’ తర్వాత అనుష్క నుండి రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్నే ఆడియన్స్ ఆశించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వేదం, బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం, మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి సినిమాలు ఆమెను నటిగా మంచి స్థానంలో కూర్చోబెట్టాయి. ఆ వరుసలో ఆమె చేస్తున్న మరో వైవిధ్యమైన సినిమానే ‘ఘాటీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌లో.. అనుష్క బస్‌లో ఓ వ్యక్తిని మర్డర్ చేసే సన్నివేశం సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. క్లైమాక్స్ షూటింగ్ మాత్రమే మిగిలివుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. జనవరి చివరివారం నుండి క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 18న సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమౌతోంది.

- December 30, 2024
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor