16 ఏళ్ల టీనేజర్‌లా మారిపోయిన సినీ నటి ఖుష్బూ..

16 ఏళ్ల టీనేజర్‌లా మారిపోయిన సినీ నటి ఖుష్బూ..

తెలుగు, తమిళ హీరోయిన్ ఖుష్బూ సుందర్‌  కొన్ని స్టన్నింగ్‌ ఫొటోలు షేర్‌ చేసింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్‌.. 16 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. న‌టిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కురాలిగా కూడా ఆమె ప్రజలకు దగ్గరైంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని స్టన్నింగ్‌ ఫొటోలు షేర్‌ చేసింది. గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో చాలా స్లిమ్‌గా ఎంతో స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలకు ‘బ్యాక్‌ టూ ద ఫ్యూచర్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

editor

Related Articles