ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. డ్రమ్స్ వాయించడంలో ఆయన రూటే సెపరేటు. అందుబాటులో ఉన్న దేని సాయంతో అయినా ఆయన అలవోకగా మ్యూజిక్‌ను వాయించగలరు. తాజాగా ఆయన దోశ తావాను డ్రమ్స్‌లా మార్చుకుని అందరినీ ఆకట్టుకున్నారు. బెంగళూరులోని ఐకానిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ విద్యార్థి భవన్‌ను శివమణి సందర్శించారు. అక్కడ అల్పాహారం ఆస్వాదించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ కిచెన్‌లోకి వెళ్లిన శివమణి.. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. దోశలు వేసే పెనంపై చిన్న కప్స్ సాయంతో సంగీతం వాయించారు. ‘శివమణి మ్యూజికల్ దోశ..’, ‘కాదేదీ సంగీతానికి అనర్హం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- December 4, 2024
0
334
Less than a minute
You can share this post!
administrator

