‘తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం’ అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో అర్చనతో కలిసి నటించిన సినిమా ‘షష్టిపూర్తి’. రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా నటించారు. పవన్‌ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. బుధవారం చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే గొప్ప కథ ఇది. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనే అంశాలను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే సినిమా’ అన్నారు. ఇళయరాజా, తోట తరణి వంటి లెజెండ్స్‌తో పనిచేయడం ఈ సినిమా స్థాయి ఏమిటో చెబుతుందని అర్చన అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి విలువలతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇళయరాజాకి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడంతో నిజంగా నా జన్మ ధన్యమైంది’ అన్నారు. చక్కటి కుటుంబ కథతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని రూపేష్ తెలిపారు.

- January 9, 2025
0
10
Less than a minute
You can share this post!
editor