తాజాగా మరో 20 ఏళ్ల క్రితం సినిమాకి సీక్వెల్‌ని లైన్ లోకి తెచ్చారు. సీక్వెల్స్‌తో సక్సెస్ అన్నది బాలీవుడ్‌కే చెల్లింది. 20-30 ఏళ్ల క్రితం హిట్ సినిమాల్ని కూడా తవ్వి తీసి వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు. ఇటవలే 20 ఏళ్ల క్రితం నాటి `నో ఎంట్రీ` సీక్వెల్‌ని ప్రకటించారు. షారుక్‌ఖాన్ హీరోగా పర్హాన్ ఖాన్ తెరకెక్కించిన `మై హూన్ నా` అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మసాలా ఎంటర్ టైనర్‌కి ఎంతోమంది అభిమానులున్నారు. షారుక్ ఖాన్, సునీల్ శెట్టి, సుస్మితాసేన్, అమృతారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. 2004లో రిలీజ్ అయింది. షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌పై నిర్మించిన మొట్టమొదటి చిత్రమిదే. ఈ సినిమా అంటే షారుక్ ఖాన్, గౌరీఖాన్ దంపతులకు ఎంతో ప్రత్యేకమైనది. తొలి సినిమానే భారీ విజయం సాధించి సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే ఈ సినిమా వారికి చాలా ప్రత్యేకం. అయితే ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. ప్రస్తుతం ఫరాఖాన్ రచయితల బృందం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్లు తెలిసింది. `హై హూ నా -2` టైటిల్‌తో పట్టాలెక్కించనున్నారు. త్వరలోనే ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది.

- February 6, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor