Movie Muzz

‘సీతా పయనం’ నుంచిరొమాంటిక్ పాట..!

‘సీతా పయనం’ నుంచిరొమాంటిక్ పాట..!

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘సీతా పయనం’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. నిరంజన్ హీరోగా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించగా, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ కామియోలో మెరిసారు.

ఇప్పటికే విడుదలైన కంటెంట్, పాటలు మంచి స్పందన పొందాయి. తాజాగా విడుదలైన ‘పయనమే’ పాట మెలోడీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యాం రాసిన ఈ గీతానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, అనూప్ రూబెన్స్ మరియు సత్య ప్రకాష్ ఆలపించారు. లిరికల్ వీడియోలో హీరో–హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Articles