మహేష్ వాయిస్‌తో ‘రావు బహదుర్’ ట్రైలర్ రిలీజ్

మహేష్ వాయిస్‌తో ‘రావు బహదుర్’ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదుర్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

“నాటకానికి లాజిక్ ఉండదు.. కానీ మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది” అంటూ మహేష్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. చనిపోవాల్సిన సమయం దాటినా ఏడాది పాటు బతికిన వ్యక్తి కథ, ఒక చిన్న అనుమానం అతని జీవితాన్ని ఎలా మార్చిందనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే చిత్రమిదని మహేష్ తన వాయిస్ ఓవర్ ద్వారా తెలిపారు.

చివరి దశ లివర్ క్యాన్సర్ నుంచి అద్భుతంగా బయటపడిన ‘రామప్ప’ అలియాస్ ‘రావు బహదుర్’ పాత్రలో సత్యదేవ్ తన నటనతో మెప్పించాడు. డార్క్ కామెడీ, సస్పెన్స్, మ్యాజికల్ రియలిజం అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్మరణ్ సాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కార్తీక్ పర్మార్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ+ఎస్ మూవీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో వికాస్ ముప్పాళ్ల, దీపా థామస్, బాల పరాశర కీలక పాత్రల్లో నటించారు. ‘రావు బహదుర్’ జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles