‘జాంబీ రెడ్డి 2’ హీరోయిన్‌గా షనాయా?

‘జాంబీ రెడ్డి 2’ హీరోయిన్‌గా షనాయా?

హనుమాన్, మిరాయ్ వంటి విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాంబీ రెడ్డి 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ యువ నటి షనాయా కపూర్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, షనాయా కపూర్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం గానీ, షనాయా టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ హర్రర్, కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కథ అందించినట్లు తెలుస్తోంది. అయితే దర్శకత్వ బాధ్యతలు మరో దర్శకుడు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ ఎంపికతో పాటు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles