97వ అకాడమీ అవార్డుల కోసం భారత్ నుండి బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా తుది జాబితా నుండి తప్పుకుంది. ఆస్కార్స్ రేసు నుండి లాపతా లేడీస్ సినిమా మిస్సైంది. 15 సినిమాల షార్ట్‌లిస్టును బుధవారం అకాడమీ ప్రకటించింది. అయితే ఆ లిస్టులో బ్రిటన్ నుండి హిందీ సినిమా సంతోష్ చోటు దక్కించుకున్నది. కిరణ్ రావు డైరెక్షన్ చేసిన ఈ ఫిల్మ్‌కు ఆస్కార్స్ షార్ట్‌లిస్టులో చోటు దక్కలేదు. 15 చిత్రాల షార్ట్‌లిస్టు నుండి అయిదింటిని తుది రేసుకు ఎంపిక చేస్తారు. లాపతా లేడీస్ ఆ లిస్టులో లేకున్నా.. ఇండియాకు చెందిన ఫిల్మ్‌మేకర్ సంధ్యా సూరి తీసిన సంతోష్ అనే సినిమాకి షార్ట్‌లిస్టులో చోటు దక్కింది. ఈ ఫిల్మ్‌లో ఇండియన్ స్టార్స్ షాహనా గోస్వామి, సునీతా రాజ్వార్ నటించారు. అయితే ఈ ఫిల్మ్ యూకే తరపున ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇచ్చింది.

- December 18, 2024
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor