సమంతను శక్తివంతమైన మహిళగా అభివర్ణిస్తుంటారు చాలామంది. చెదరని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం, ముక్కుసూటి తనం ఇవన్నీ ఆమెకు ఆభరణాలు. తెలుగుతెరపై తిరుగులేని స్టార్‌గా వెలిగిన సమంత.. ప్రస్తుతం టాలీవుడ్‌కి దూరంగా ఉంటూవుంది. ఇన్‌స్టాకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. దాని ద్వారానే అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. రీసెంట్‌గా అభిమానులతో ఇన్‌స్టా ద్వారా కబుర్లు చెప్పింది సామ్. ‘నెగెటివిటీని ఎలా అధిగమిస్తారు?’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘రెగ్యులర్‌గా మెడిటేషన్ చెయ్.. నెగెటివిటీకి ఆమడ దూరంలో ఉంటుంది.’ అని సమాధానమిచ్చింది సామ్. ‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బెస్ట్ హీరోయిన్ ఎవరు?’ అని మరో అభిమాని అడగ్గా.. ‘పార్వతీ తిరువోతు (ఉల్లోళుక్కు), సాయిపల్లవి (అమరన్), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియాభట్ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్‌ఎల్), దివ్యప్రభ (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్), వీరంతా నా రాక్‌స్టార్స్. ఇంకెవర్నయినా మర్చిపోయుంటే సారీ..’ అంటూ ఒక నవ్వు నవ్వేసింది.

- February 25, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor