సందేశం, వినోదం కలగలిపిన కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘అనగనగా’. సుమంత్ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. కాజల్ చౌదరి కథానాయిక. సన్నీ సంజయ్ దర్శకుడు. రాకేష్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్‌లో భాగంగా నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో సుమంత్ ఉపాధ్యాయుడిగా కనిపించారు. పిల్లలకు పాఠాలు ఎలా చెబితే అర్థమవుతాయో వివరిస్తూ ఆయన కనిపించారు. ‘నోటితో విసిరి.. చేతులతో ఏరుకునేది ఏంటి?’ అంటూ సుమంత్ సంధించిన పొడుపుకథ టీజర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో సుమంత్ క్లాస్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారని, కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్ పాత్రలు కూడా అలరిస్తాయని, మనసుల్ని హత్తుకునే కథాంశంతో దర్శకుడు సినిమాను మలిచారని నిర్మాతలు చెబుతున్నారు.

- February 25, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor