లవ్ టుడే ఫేం ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా సినిమా డ్రాగన్. ఓ మై కడవులే ఫేం అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాపై డైరెక్టర్ శంకర్ ప్రశంసలు కురిపించాడు. అశ్వత్ మారిముత్తు అద్భుతమైన రచనతో సినిమా తెరకెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రదీప్ రంగనాథన్ రాఘవన్ పాత్రలో మరోసారి తనలోని అద్బుతమైన నటుడిని చూపించాడు. ఇక జార్జ్ మరియస్, అనుపమ పరమేశ్వరన్, ముస్కిన్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చివరి ఇరవై నిమిషాలు నన్ను కన్నీళ్లు పెట్టించాయి. మోసగాళ్ల సంఖ్య పెరుగుతున్న ఈ ప్రపంచంలో చాలా అవసరమైన సందేశం ఇది.. అని ట్వీట్ చేశాడు శంకర్. ఓ అభిమానిగా.. నా అభిమాన దర్శకుడు (శంకర్) నుండి స్పూర్తి పొందే వ్యక్తిగా.. మీరు నా గురించి మాట్లాడటం నమ్మశక్యంగా అనిపించడం లేదు. నా భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నా. ధన్యవాదాలు సార్.

- February 24, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor