లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినే ఉంటారు. దేశమంతా మారుమ్రోగిపోతున్న సమయంలో ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఒక నటి పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. సల్మాన్‌ఖాన్‌పై బెదిరింపులకు పాల్పడే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో ఆ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆ గ్యాంగ్‌స్టర్ పేరును చెబుతూ సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఒక మెసేజ్ పెట్టారు. ఆ పోస్టు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మీ మొబైల్ నెంబరు ఇస్తే డైరెక్ట్‌గా మీతోనే మాట్లాడతాను. నన్ను నమ్మండి అంటూ రాసుకొచ్చింది.

- October 18, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
administrator