కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రాంచైజీగా తెరకెక్కుతుండగా.. సలార్ 2కి ఆయనే డైరెక్టర్- ప్రభాస్ కెరీర్‌లో సలార్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన సలార్ పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిందన్న విషయం మీకు తెలిసిందే. ఈ క్రేజీ సినిమా తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభాస్ క్రేజ్ రోజు రోజుకీ ఏ స్థాయిలో పెరిగిపోతోందో ఈ ఒక్క అప్‌డేట్ చెప్పకనే చెబుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, రాజాసాబ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. సలార్‌లో శృతిహాసన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా… జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. సీక్వెల్‌లో కొత్తగా యాక్టర్లు ఎవరినైనా తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.