మురుగదాస్‌ను ఎత్తుకున్న సల్మాన్‌‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌లు..

మురుగదాస్‌ను ఎత్తుకున్న సల్మాన్‌‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌లు..

బాలీవుడ్‌ యాక్టర్లు అమీర్ ఖాన్, సల్మాన్‌ఖాన్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఎఆర్‌ మురుగదాస్  ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా బిజీ షెడ్యూల్‌తో ఉన్న ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. సినిమా లవర్స్‌, అభిమానులకు మాత్రం విజువల్‌ ఫీస్టే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముగ్గురూ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా బిజీ షెడ్యూల్‌తో ఉన్న ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. కాగా ఓ వైపు అమీర్‌ఖాన్‌ మరోవైపు సల్మాన్ ఖాన్‌, ఎఆర్‌ మురుగదాస్‌ను ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సల్మాన్‌ఖాన్‌- మురుగదాస్‌ కాంబోలో వస్తోన్న సికిందర్‌‌. ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుక‌గా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. సికిందర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా   ముగ్గురూ ఇలా సందడి చేశారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తమ అభిమాన నటీనటులు, దర్శకుడిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫాలోయర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. సికిందర్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. కాజల్‌ అగర్వాల్ మరో కీ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాని నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోందని ఇన్‌సైడ్‌ టాక్‌.

editor

Related Articles