RC16 సస్పెన్స్.. ఫ్యాన్స్ ఎదురు చూపులు

RC16 సస్పెన్స్.. ఫ్యాన్స్ ఎదురు చూపులు

రామ్ చరణ్  హీరోగా జాన్వీ కపూర్  హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న సినిమా గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా రేపు చరణ్ బర్త్ డే కానుకగా సాలిడ్ ట్రీట్‌ని అయితే అభిమానులు ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుండి ఇప్పుడు ట్రీట్ ఉంటుందా లేదా అనేది మంచి సస్పెన్స్‌గా మారింది. మెయిన్‌గా వీడియో కట్‌ని అయితే మేకర్స్ రెడీ చేశారు కానీ దీనికి రెహమాన్ నుండి స్కోర్ రావాల్సి ఉంది. దీని పనుల్లోనే మేకర్స్ ఉండగా ప్రస్తుతం మిక్సింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవి కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయితే ఈ సాయంత్రమే ఏదోఒక క్లారిటీ వచ్చేస్తుంది అని టాక్. అయితే ఒకవేళ గ్లింప్స్ రాని పక్షంలో మాత్రం మేకర్స్ ఖచ్చితంగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారని సమాచారం. సో ఈ సాయంత్రానికి మాత్రం ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఏదో ఒకటి తేలిపోతుంది అని చెప్పవచ్చు.

editor

Related Articles