‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా

‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా

‘ఓ మామూలు కుర్రాడు జీవితంలో సాగే ప్రయత్నమే ‘డ్రాగన్‌’. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తూనేవుంటారు. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెల్లో మా డ్రాగన్‌ సినిమా నిలిచిపోతుంది. నా ‘లవ్‌ టుడే’ని బాగా ఆదరించారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నా.’ అని హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ అన్నారు. ఆయన హీరోగా రూపొందించిన చిత్రం ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’. అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ కథానాయికలు. అశ్వత్‌ మారిముత్తు దర్శకుడు. కల్పాతి ఎస్‌.అఘోరం, కల్పాతి ఎస్‌.గణేష్, కల్పాతి ఎస్‌. సురేష్‌ నిర్మాతలు. ఈ నెల 21న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌ మాట్లాడారు. యువతరం మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా సినిమా ఉంటుందని నిర్మాత అర్చనా కల్పాతి చెప్పారు.

editor

Related Articles