ఇటీవలే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న టాలీవుడ్ హీరో మెహన్ బాబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో తనపై తన కుటుంబంపై నెగిటివ్ ప్రచారాలతో పాటు కించపరుస్తూ పలు వెబ్‌సైట్‌లు కథనాలు ప్రచురించాయని.. ఈ విషయంలో తన ఫొటోలు కానీ, వాయిస్‌ను కానీ గూగుల్, సోషల్ మీడియాలో వాడొద్దని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ శనివారం విచారణకు రాగా.. హైకోర్టు పరిశీలించి దీనిపై సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా.. మోహన్ బాబు కంటెంట్‌ను గూగుల్ నుండి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేగాకుండా.. మోహన్ బాబు ఫొటోలను కానీ.. వాయిస్‌ను కానీ గూగుల్, సోషల్ మీడియాలో వాడొద్దని వెల్లడించింది.
- December 21, 2024
0
115
Less than a minute
Tags:
You can share this post!
editor


