మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి హీరోస్‌లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. అయితే రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా “మాస్ జాతర”. ఫ్యాన్స్‌లో సహా మాస్ ఆడియెన్స్‌లో గట్టి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అంతా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇపుడు లాక్ అయ్యింది. ఈ సినిమాని సితారా బ్యానర్ లోనే ఇపుడు మాస్ ట్రీట్‌తో అలరిస్తే నెక్స్ట్ టైం రవితేజతో ఒక సోషియో ఫాంటసీ జానర్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు. దీంతో మాస్ మహారాజ్ నుండి ఇంకో క్రేజీ ప్రాజెక్ట్‌ని చూడనున్నామని చెప్పవచ్చు. ఇక మాస్ జాతర రిలీజ్‌ని మే 9 రిలీజ్‌కి ఫిక్స్ చేశారు కానీ ఇది కూడా కొంచెం ఆలస్యం అవుతుందని టాక్ వినబడుతోంది.

- March 28, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor