సరైన మాస్ క్యారెక్టర్ పడిందంటే చెలరేగిపోవడం రవితేజకు పరిపాటే. రెండేళ్ల క్రితం ‘ధమాకా’తో బాక్సాఫీస్ దగ్గర ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో వంద కోట్ల విజయాన్ని అందుకున్నారాయన. ప్రస్తుతం అదే తరహాలో ఆయన చేస్తున్న సినిమా ‘మాస్ జాతర’. రచయిత భాను భోగవరపు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. రవితేజ, డా.రాజేంద్రప్రసాద్ ఇందులో తాతామనవళ్లుగా నటిస్తున్నారని తెలిసింది. వారి కాంబినేషన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, థియేటర్లన్నీ నవ్వులతో మారుమోగిపోతాయని చిత్రబృందం చెబుతోంది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ మెమరబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఇడియట్’లోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ పాటని రీమిక్స్ చేస్తున్నారట. రవితేజ, శ్రీలీలపై ఈ పాట ఉంటుందట.

- March 5, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor