నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సింగర్ కల్పనకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చారని పేర్కొన్నారు. అయితే, కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగర్ కల్పన హైదరాబాద్ నిజాంపేట రోడ్డులోని ప్రివిలేజ్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా ఆమె ఇంటి తలుపులు తీయకపోవడంతో పక్క ఫ్లాట్ వారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కల్పన ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లగా కల్పన అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు.

- March 5, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor