100 కోట్లు రాబట్టడం ఖాయం..

100 కోట్లు రాబట్టడం ఖాయం..

రాబిన్‌హుడ్‌ సినిమా చేశాక నటునిగా నామీద నాకు కాన్ఫిడెన్స్‌ రెట్టింపయ్యింది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందీ సినిమా అని డా.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాబిన్‌హుడ్‌’. మైత్రీమూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న రాజేంద్రప్రసాద్‌ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ఇందులో దేశంలోనే అత్యున్నతమైన సెక్యూరిటీ ఏజెన్సీకి నేను అధినేతను. నా ఏజెన్సీలో పనిచేసేందుకు హీరో వస్తాడు. మా కాంబినేషన్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. నా టైమింగ్‌ని నితిన్‌, అతని టైమింగ్‌ని నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్లు ఇలా డిజైన్‌ చేయబడ్డాయి. మా మధ్య వెన్నెల కిషోర్‌. సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేసి చాలా రోజులైంది.

editor

Related Articles