ధనుష్ హీరోగా, పెద్ద హీరో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావు పెద్దబడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ని ఇప్పటికే స్టార్ట్ చేశారు. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ‘కుబేర’. ధనుష్, నాగార్జున, రష్మికల పాత్రలను వేరు వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. ఈ ప్రచార చిత్రాల ద్వారా పాత్రల నేపథ్యాన్ని విభిన్నంగా ప్రెజెంట్ చేశారు. ఈ నెల 15న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రష్మిక కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ముంబై మహాసముద్రం బ్యాక్‌డ్రాప్‌లో అందమైన చిరునవ్వుతో రష్మికను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. అద్భుతమైన కథ, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందుతోందనీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

- November 11, 2024
0
28
Less than a minute
Tags:
You can share this post!
administrator