చిరంజీవితో జతకట్టనున్న రాణీ ముఖర్జీ?

చిరంజీవితో జతకట్టనున్న రాణీ ముఖర్జీ?

ఒకనాటి బాలీవుడ్‌ హీరోయిన్ రాణీ ముఖర్జీని ఓ క్రేజీ ఆఫర్‌ వరించిందని బాలీవుడ్‌ మీడియాలో ఒక రూమర్ ఉంది. పైగా అది హిందీ సినిమా కాదు.. తెలుగు సినిమా. అది కూడా చిరంజీవి సినిమా. వివరాల్లోకెళ్తే.. చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకమట. అది కూడా మధ్య వయస్కురాలి పాత్రట. సీనియర్ హీరోయిన్లు మాత్రమే పోషించదగ్గ పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ పేరును సూచించారట దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ఆ ప్రపోజల్‌కి చిరంజీవి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టుగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుందని చిరంజీవి భావించడంతో ఆ పాత్ర రాణీ ముఖర్జీని వరించిందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తారట.

editor

Related Articles