‘ఛావా’ను చూసిన అలియాభట్‌, హిట్ మూవీ అని కితాబు…

‘ఛావా’ను చూసిన అలియాభట్‌, హిట్ మూవీ అని కితాబు…

అలియా భట్‌కు ఇగో అసలు లేనేలేదు, తన తోటి హీరోయిన్‌ రష్మిక మందన్నను పొగడ్తలతో ముంచెత్తింది. విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ టాక్‌తో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఛావా’ను రీసెంట్‌గా అలియాభట్‌ చూసింది. వెంటనే ఇన్‌స్టా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఛావా’ ఓ అద్భుతం. ముందుగా డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌కి అభినందనలు. చాలా గొప్పగా తీశారు. విక్కీకౌశల్‌ అద్భుతంగా నటించారు. నా అభిమాన నటుడు అక్షయ్‌ ఖన్నా ఔరంగజేబుగా మారిపోయారు. ఇక రష్మిక.. ‘చాలా అందంగా ఉన్నావు.. ముఖ్యంగా నీ కళ్లు..’  అంటూ ప్రశంసలు గుప్పించింది అలియా భట్‌. అలియా పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

editor

Related Articles