హిందీ భాష విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తాజాగా స్పందించారు. ఇది చాలా సున్నితమైన విషయమని.. తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలోని పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తమిళులు భాష కోసం ప్రాణాలు అర్పించారు. అందుకే ఇలాంటి వాటితో ఆటలొద్దు. తమకు ఏ భాష అవసరమో తమిళులకు తెలుసు. ముఖ్యంగా పిల్లలు.. ఏ భాష కావాలో ఎంచుకునే జ్ఞానం వారికి ఉంది’ కాబట్టి పిల్లలకి ఇష్టమైన భాషనే ప్రోత్సహించాలి అని కమల్ హాసన్ అన్నారు.

- February 22, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor