విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలోని చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా హీరోయిన్ రశ్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండ ఇంటెన్స్ లుక్‌తో ఉన్న స్టిల్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను షేర్ చేయొచ్చో లేదో తెలియదని, అయినా కూడా ‘రణబాలి’ టీమ్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తోందని ఆమె పేర్కొన్నారు. తెరపై ఆ ప్రపంచాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రశ్మిక వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె జయమ్మ పాత్రలో కనిపించనుండగా, విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
- July 14, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

