లాంగ్ బ్రేక్ తీసుకుని వెంకటేష్‌కి పాట పాడిన రమణ గోగుల

లాంగ్ బ్రేక్ తీసుకుని వెంకటేష్‌కి పాట పాడిన రమణ గోగుల

టాలీవుడ్ సింగ‌ర్, సీనియర్ సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయవలసిన అవ‌స‌రం లేదు. త‌న మ్యూజిక్‌తో బద్రి, త‌మ్ముడు, ల‌క్ష్మీ, ప్రేమంటే ఇదేరా, యోగి, జానీ సినిమాల‌కు సూప‌ర్ హిట్‌ల‌ను అందించడ‌మే కాకుండా త‌న గాత్రంతో ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌ను పాడారు. అయితే ర‌మ‌ణ గోగుల‌, వెంక‌టేష్‌ల సూప‌ర్ కాంబో గురించి ప‌రిచ‌యం అవ‌సరం లేదు. ఇప్ప‌టికే వీరి కాంబోలో వ‌చ్చిన ప్రేమంటే ఇదేరా, ల‌క్ష్మీ చిత్రాలు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. అయితే 18 ఏళ్ల త‌ర్వాత ఈ కాంబో రిపీట్ కాబోతోంది. అవును వెంక‌టేష్ కోసం పాట పాడాడు ర‌మ‌ణ గోగుల‌. వెంక‌టేష్, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. సంక్రాంతికి వ‌స్తున్నాం  అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌బృందం. ఇందులో భాగంగా ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది. సినిమా నుండి ఫ‌స్ట్ సింగిల్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఈ పాటను పాడింది ర‌మ‌ణ గోగుల‌. ఈ సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.

administrator

Related Articles