బాలీవుడ్ నుండి వచ్చిన ఆల్‌టైం క్లాసిక్ సినిమాలలో కరణ్ అర్జున్ ఒకటి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించాడు. ఇక ఇదే సినిమాకు హృతిక్ రోషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1995లో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందించడమే కాకుండా రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సోదరులుగా నటించడంతో థియేటర్లకు క్యూ కట్టారు ప్రేక్షకులు. ఈ సినిమాను 30 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. నవంబర్ 22న ఈ సినిమాను 4కే వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

- November 14, 2024
0
34
Less than a minute
Tags:
You can share this post!
administrator