హీరో రానా ‘ది రానా దగ్గుబాటి షో’ పేరుతో ఓ సెలబ్రిటీ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. స్పిరిట్ మీడియా పతాకంపై రానా స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ ఒరిజినల్ సిరీస్ ఈ నెల 23 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌లో రాబోతున్న ఈ సిరీస్‌లో సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడంతో పాటు వివిధ యాక్టివిటీస్‌లో పాల్గొంటారు. రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని వంటి ప్రముఖులు ఈ టాక్‌షోలో పాల్గొనబోతున్నారు. ఫిల్టర్ చేయని సంభాషణలు, సెలబ్రిటీల తెరవెనక ముచ్చట్లు, ఇప్పటివరకు వారి ఫ్యాన్స్‌కు తెలియని విశేషాలతో ఈ టాక్‌షో వీక్షకులను ఆకట్టుకుంటుందని ప్రైమ్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ తెలిపారు. సినీ తారల నిజ జీవితాలను తెలుసుకోడానికి ఇదొక అద్భుతమైన వేదిక అని టాక్‌షో హోస్ట్, క్రియేటర్ రానా పేర్కొన్నారు.

- November 14, 2024
0
31
Less than a minute
Tags:
You can share this post!
administrator