ఐపీఎల్‌లో ఆటగాళ్లను ఎలాగైతే కొనుక్కుంటారో.. అలా కొందర్ని కొనుక్కొని, వాళ్లతో ఆటాడించి, వాళ్లపై బెట్టింగులు కాసి డబ్బు సంపాదించే సంస్కృతి రూరల్‌లో ఉంది. అలా కొనుక్కోబడ్డవాడే ‘ఆట కూలి’. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్‌చరణ్ ఆట కూలీగా కనిపించనున్నారట. ఇందులో కథ రీత్యా రామ్‌చరణ్ అన్ని ఆటల్లో నిష్ణాతుడై ఉంటాడట. అందుకే.. క్రికెట్, కుస్తీ, కబడ్డీ.. ఇలా అన్ని ఆటలూ ఈ కథలో మిళితమై ఉంటాయట. గ్రాఫిక్స్ జోలికి పోకుండా, గ్రాండియర్‌గా సెట్లేయించేస్తూ ఇప్పటికే కొంతమేర షూట్‌ని బుచ్చిబాబు కానిచ్చేశారట. దానికోసం నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో దిగ్గజ క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ కీలకపాత్ర పోషించనున్నారట. ధోనీకి జనాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిజంగా ధోనీ ఇందులో భాగమైతే ఈ సినిమా మైలేజీ వేరేలా ఉంటుంది.

- March 17, 2025
0
45
Less than a minute
Tags:
You can share this post!
editor