‘రాబిన్‌హుడ్‌’ పెద్ద బ్లాక్‌బస్టర్‌ చేయండని కోరిన నితిన్..

‘రాబిన్‌హుడ్‌’ పెద్ద బ్లాక్‌బస్టర్‌ చేయండని కోరిన నితిన్..

హీరో నితిన్‌ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ సినిమాని నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ని నిర్వహించారు. 28న కాలేజ్‌కి బంక్‌ కొట్టైనా సరే మా సినిమా చూడండని విద్యార్థులకు నితిన్‌ పిలుపునిచ్చారు. చదువుకునే సమయంలో మంచి బ్రేక్‌ కోసం చూసే సినిమా ఇదని శ్రీలీల అన్నారు. ‘రాబిన్‌హుడ్‌’ సినిమాను హార్ట్‌ఫుల్‌గా చేశామని, సినిమా చూసి బ్లెస్‌ చేయండంటూ స్టూడెంట్స్‌ని దర్శకుడు వెంకీ కుడుముల కోరారు. ‘రాబిన్‌హుడ్‌’ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నిర్మాత వై.రవిశంకర్‌ నమ్మకం వెలిబుచ్చారు.

editor

Related Articles