మూడో పెళ్లిపై రాఖీ సావంత్‌ సంచలన ప్రకటన…

మూడో పెళ్లిపై రాఖీ సావంత్‌ సంచలన ప్రకటన…

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్  సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్‌ సెక్స్‌ క్వీన్‌గా పేరుగాంచిన రాఖీ సావంత్.. తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్‌ ఖాన్‌ దురానీని రహస్యంగా వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. తాజాగా రాఖీ సావంత్‌ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

పాకిస్థాన్‌లో తనకు చాలామంది అభిమానులు ఉన్నారని.. ఆ దేశ ప్రజలను తాను ప్రేమిస్తున్నట్లు పేర్కొంది. డోడి ఖాన్‌తో వివాహం పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలిపింది. రిసెప్షన్‌ మాత్రం భారత్‌లో ఉంటుందని… పెళ్లి తర్వాత హనీమూన్‌ కోసం స్విట్జర్లాండ్‌ లేదా నెదర్లాండ్స్‌కు వెళ్లనున్నట్లు చెప్పింది. చివరిగా పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడనున్నట్లు రాఖీ సావంత్‌ వెల్లడించింది.

editor

Related Articles