గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్టు 1తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ గ్లోబల్ స్టార్ కాంపౌండ్ నుండి రాబోతున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటిస్తోన్న (NTRNeel). చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు వార్తలు ఊపందుకున్నాయి. ప్రస్తుతానికి ఈ వార్తలు పుకార్లు మాత్రమేనని పీఆర్ టీం నుండి క్లారిటీ వచ్చింది. ఇక ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తుండగా.. మేకర్స్ దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. ఈ సినిమాలో సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించనుంది.
తారక్ మరోవైపు దేవర పార్టు 2 కూడా చేస్తున్నాడని తెలిసిందే. పార్టు 2కు సంబంధించి ఇప్పటికే కొంతభాగం షూట్ పూర్తయినట్టు తెలుస్తుండగా.. మిగిలిన భాగం ఎప్పుడు పూర్తవుతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో ఓ వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడని పరిశ్రమ వర్గాల టాక్.