హీరో రాంచరణ్ టైటిల్ రోల్‌లో నటించిన ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. పలు ప్రాంతాల్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అంజలి నటించిన పార్వతి పాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రమోషనల్ ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్ ఫలితంపై అంజలిని రిపోర్టర్లు పలు ప్రశ్నలు వేశారు. ఓ నటిగా నా బాధ్యతను నిర్వర్తించా. ఈ పాత్ర కోసం నేను మొత్తం కాన్‌సంట్రేట్ చేశాను. గేమ్ ఛేంజర్ విషయంలో నేను సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే ఈ సినిమా చూసిన జనరల్ ఆడియెన్స్ ఎవరూ బాగాలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూశామని చెప్పారంది అంజలి.

- January 28, 2025
0
26
Less than a minute
Tags:
You can share this post!
editor