కూలీలో దేవాగా హీరో రజనీకాంత్

కూలీలో దేవాగా హీరో రజనీకాంత్

సీనియర్‌ స్టార్లతో సినిమా ఎలా తీయాలో ‘విక్రమ్‌’తో చూపించాడు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఆ తర్వాత ఈ విషయంలో చాలామంది దర్శకులు ‘విక్రమ్‌’ ఫార్ములానే ఫాలో అయ్యారు.. అవుతున్నారు కూడా. కమల్‌హాసన్‌తోనే అంతటి విధ్వంసాన్ని క్రియేట్‌ చేసిన లోకేష్‌ కనగరాజ్‌కి మాస్‌కి పర్యాయపదమైన హీరో రజనీకాంత్‌ దొరికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అభిమానుల్ని ఉత్తేజానికి గురిచేస్తున్న అంశం ఇదే. ప్రస్తుతం ఆయన రజనీ సార్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రధారులు. వీరితోపాటు మలయాళ, హిందీ భాషల నుండి కూడా చాలామంది ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. 50 ఏళ్ల కాల వ్యవధిలో జరిగే ఈ కథలో దేవాగా పవర్‌ఫుల్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపిస్తారని, ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయని, కథలో ఊహించని మలుపులు ఉంటాయని యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి. శ్రుతిహాసన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది.

editor

Related Articles