రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. 38 ఏళ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానాలో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆమె చనిపోయారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి సినిమాలో నటించింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్‌ను కలిసి ధైర్యంగా ఉండమని ఓదారుస్తున్నారు. తాజాగా నటుడు వెంకటేష్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజేంద్ర ప్రసాద్‌ని కలిసి పరామర్శించారు.

- October 5, 2024
0
42
Less than a minute
You can share this post!
editor