మెగాస్టార్ చిరంజీవి ఎడమ చేతి వేళ్లకు గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి మృతిచెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్‌ను కలిసి ధైర్యం చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుటుంబంతో రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించడానికి వెళ్లి కలిసి ఓదార్చారు.

- October 5, 2024
0
49
Less than a minute
You can share this post!
editor