ఎప్పుడెప్పుడా అని అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రావడం రావడమే అన్ని యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది ఈ ట్రైలర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ వాటిని అందుకొని మంచి వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. అయితే ట్రైలర్ చూసిన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకులు ప్రశాంత్ వర్మతో పాటు, హారీష్ శంకర్, రిషబ్ శెట్టి, అనిల్ రావిపూడి తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న చెలరేగుతుంది.

- November 18, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
administrator