అమితాబ్ బచ్చన్ 120 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టారు. 2024-25లో ఆయన రూ.350 కోట్లు ఆర్జించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పన్ను చెల్లించిన స్టార్‌గా నిలిచారు. పన్ను చెల్లింపుల్లో షారూక్, విజయ్‌ను దాటేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీగా చరిత్రకెక్కారు. 2024-2025 సంవత్సరానికి బిగ్ బీ అమితాబ్.. సుమారు రూ.120 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. పన్ను చెల్లింపుల్లో ఆయన షారూక్ ఖాన్, విజయ్‌లను దాటేశారు. గత ఏడాది షారూక్ ఖాన్ రూ.92 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ నటుడు అమితాబ్ చెరిపేశారు. 82 ఏళ్ల ఆ స్టార్ నటుడు 2024-25 సంవత్సరానికి రూ.120 కోట్ల పన్ను కట్టారు.

- March 18, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor