సక్సెస్‌తో డాకు మహారాణిగా పిలువబడుతున్న ప్రగ్యా జైస్వాల్‌

సక్సెస్‌తో డాకు మహారాణిగా పిలువబడుతున్న ప్రగ్యా జైస్వాల్‌

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా జైస్వాల్. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటించిన లెజెండ్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వరుణ్‌ తేజ్‌తో నటించిన కంచె సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మరోసారి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్‌లో మెరిసింది ప్రగ్యా జైస్వాల్‌. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఓ ఇంటర్వ్యూలో హీరో బాలకృష్ణతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం, నటీనటుల మధ్య ఏజ్‌ గ్యాప్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రగ్యా జైస్వాల్‌. ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బాలకృష్ణ అందరినీ ఒకేలా గౌరవిస్తారు.. చాలా మంచి మనిషి. పాత్రకు తగ్గట్టుగా యాక్టర్లను సెలెక్ట్ చేస్తారు తప్ప వారి వయస్సును చూసి సినిమా అవకాశాలివ్వరంది. డాకు మహారాజ్‌ థియేటర్లలో విడుదలైనప్పటి నుండి అంతా నన్ను డాకు మహారాణి అని పిలుస్తున్నారు. ఆ పాత్రకు ప్రేక్షకులు అంతలా కనెక్ట్‌ అయ్యారు. ఒక నటిగా ఇది నాకెంతో సంతృప్తినిచ్చే విషయమంది ప్రగ్యా జైస్వాల్‌. ఈ హీరోయిన్ బాలకృష్ణతో మరోసారి అఖండ 2 సినిమాలో కూడా నటిస్తోంది.

editor

Related Articles