ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాతే ‘స్పిరిట్‌’ సెట్స్‌లోకి ప్ర‌భాస్.!

ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసిన తర్వాతే ‘స్పిరిట్‌’ సెట్స్‌లోకి ప్ర‌భాస్.!

హీరో ప్ర‌భాస్, అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న సినిమా ‘స్పిరిట్‌’. ఈ సినిమాని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నుండ‌గా.. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది, ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఏడాది చివ‌రిలో ‘స్పిరిట్‌’ సెట్స్ మీద‌కి వెళ్ల‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి మ‌రో అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం చేతిలో ఉన్న‌ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే సందీప్ రెడ్డి స్పిరిట్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. స్పిరిట్ షూటింగ్ మొత్తం 120 రోజులకు పైగా జరగనుందని, అందులో 90 రోజులకు పైగా ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ జిమ్‌లో తీవ్రంగా వర్కౌట్ చేస్తూ కొత్త లుక్‌లో కనబడబోతున్నారట. ఇప్పటివరకూ చూడని ప్రత్యేకమైన లుక్‌లో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జ‌రుప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

editor

Related Articles