టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూరి – సేతుపతి ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటి టబు ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో కథానాయిక పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాధికా విజయ్‌కి జోడీగా నటిస్తుందా లేదా విలన్ పాత్రలో నటిస్తుందా అనేది కన్‌ఫర్మ్ కావాల్సి ఉంది. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని సమాచారం. 2012లో ధోని సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన రాధికా ఆప్టే ఆ తర్వాత కబాలి, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

- April 16, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor